![]() |
![]() |

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -245 లో.. సుధా చేస్తున్న హోమం కోసం అవసరమైన వస్తువులు తీసుకొని రావడానికి పంతులు గారు సూపర్ మార్కెట్ కి వెళ్తారు. ఆ లిస్ట్ శకుంతల చూసి ప్రమీలని తీసుకొని రమ్మని చెప్తుంది. నేనా అని ప్రమీల అంటుంది. ఇప్పుడు గుర్తు వచ్చిందా.. ఏం చెయ్యాలో ఏం వద్దో అని శకుంతల అంటుంది. దేవుడు రాసిన రాతకి ఎవరు ఏం చెయ్యలేరు.. పర్లేదు తీసుకొని రా అని ప్రమీల పట్ల పంతులు పాజిటివ్ గా మాట్లాడతాడు. ప్రమీల అన్ని పూజ సామాను తీసుకుంటుంది. అప్పుడే పైనున్నా పసుపు కుంకుమ తీస్తుంది. అది పొరపాటున తనపై పడుతుంది. అందరు తనని చూసి షాక్ అవుతారు. ఆ దేవుడు నీకు మంచి రోజులు రాబోతున్నాయని చెప్పాడు.. నువ్వు అలా ఉండడం దేవుడు కి కూడా ఇష్టం లేదని పంతులు అంటాడు.
అత్తయ్య గారు ఇప్పటికైనా మీ నిర్ణయం మార్చుకోండి అని శకుంతలతో గంగ అంటుంది. దాంతో శకుంతల గిల్టీగా ఫీల్ అయి అక్కడ నుండి వెళ్తుంది. ఆ తర్వాత పంతులికి కావలసిన సామాను నేను తీసుకొని వస్తానంటూ గంగ అంటుంది. కాసేపటికి ప్రమీలని రుద్ర ఇంటికి తీసుకొని వెళ్తాడు. తనని అలా చూసి ఇషిక, వీరు షాక్ అవుతారు. ఏమైందని పెద్దసారు అడుగుతాడు. ప్రమీల ఇలా ఉండడం ఆ దేవుడికి కూడా ఇష్టం లేదు పెద్దనాన్న అని చెప్తాడు. పెద్దమ్మ ఇలా చెయ్యదు తన మనసు ఎవరో పొల్యూట్ చేశారని రుద్ర అంటాడు. ఇది ఒక్కందుకు మంచిదేలే ఎందుకంటే పెద్దమ్మ ఇలాంటి నిర్ణయాలు తీసుకోదని వీరు, ఇషిక వాళ్ళకి కౌంటర్ ఇచ్చేలా మాట్లాడతాడు రుద్ర. ఆ తర్వాత శకుంతల దగ్గరికి పెద్దసారు వెళ్లి.. ప్రమీల మన కోడలు తనని బాధపెట్టేలా ఏం చెయ్యకని అంటాడు. ఆ తర్వాత స్నేహకి తన క్లాస్ మేట్ ఫోన్ చేసి ఈవెనింగ్ డిన్నర్ కి రమ్మని చెప్తాడు. ఏదో లిఫ్ట్ ఇచ్చావని వచ్చానంతే ఇలా డిన్నర్ ఏంటి అని అతనితో కోపంగా మాట్లాడి ఫోన్ కట్ చేస్తుంది. ఈ అమ్మాయితో చాలా కష్టం అని ఆ అబ్బాయి వీరుతో అంటాడు. నేను చెప్పాను కదా అంత సులువుగా పడదు అని వీరు అంటాడు.
ఆ తర్వాత విశ్వ ఇంటికి వస్తాడు. హోమంలో కూర్చోవాలని సుధా అంటుంది. నేను కూర్చొనని విశ్వ వెళ్ళిపోతాడు. అతని వస్తువు ఏదైనా పక్కన పెట్టుకొని కూర్చోమని సుధాకి పంతులు చెప్తాడు.. ఆ తర్వాత ప్రమీలకి కార్తీక్ గాజులు కొనుకొని వస్తాడు. ఆ విషయం గంగ, రంగాలు పసిగట్టి తన నోటితోనే చెప్పేలా చేస్తారు. ఎందుకు మా అక్కకి గాజులు తీసుకొని రావాలనిపించింది అని గంగ అడుగుతుంది. మేడమ్ అంటే నాకు గౌరవం ఉంది అందుకే అని కార్తీక్ అంటాడు. ప్లాన్ సక్సెస్ అవుతుందని గంగ, రంగా అంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |